హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఈ నెల 13వ తేదీన వైసీపీలో చేరనున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి పొట్లూరి వరప్రసాద్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది.

గత ఎన్నికల సమయంలో కూడ పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే ఆ సమయంలో ఆయన వెనక్కు తగ్గారు.

బుధవారం నాడు హైద్రాబాద్‌లో జగన్ సమక్షంలో పొట్లూరి వరప్రసాద్ వైసీపీలో చేరనున్నారు.  విజయవాడ నుండి  వైసీపీ అభ్యర్ధిగా  ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేయనున్నారు.

ఇటీవలనే వైసీపీలో  దాసరి జై రమేష్‌ చేరాడు. ఆయన కూడ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.పొట్లూరి వరప్రసాద్ వైసీపీలో చేరనుండడంతో దాసరి జై రమేష్‌కు విజయవాడ ఎంపీ టిక్కెట్టు దక్కకపోవచ్చని చెబుతున్నారు.