తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ అఫిడవిట్ లో చెప్పారు. కాగా, భీమవరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేస్తారు. అనంతరం భీమవరంలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. 

విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ తన ఆస్తులు ప్రకటించారు. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 

తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ అఫిడవిట్ లో చెప్పారు. కాగా, భీమవరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేస్తారు. అనంతరం భీమవరంలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. 

పవన్ కళ్యాణ్ నామినేషన్‌లో ఇచ్చిన ఆస్తి వివరాలు:

చరాస్ధుల విలువ-రూ.12 కోట్లు
స్ధిరాస్తుల విలువ రూ. 40.81 కోట్లు
అప్పులు: రూ. 33.72 కోట్లు
పవన్‌ భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ- రూ.3.20 కోట్లు

కాగా, తన వృత్తిని గురించి చెప్పారు. ఆయన నటుడు మాత్రమే కాకుండా డైరెక్టర్, స్టంట్, డ్యాన్ కొరియోగ్రాఫర్. 1996లో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో ఆయన సినీ రంగంలో ప్రవేశించారు. 

ఆయన 1971 సెప్టెంబర్ 2వ తేదీన బాపట్లలో జన్మించారు. ఆయన ముద్దుపేర్లు పవర్ స్టార్, కల్యాణ్ బాబు. ఆయన అభిమాన నటి సావిత్రి. అభిమాన నటులు చిరంజీవి, ఆల్ పోసినో, రాబర్ట్ డీ నీరో, అమితాబ్ బచ్చన్. 

ఇష్టమైన వాహనాలు... హార్లీ డేవిడ్సన్, మెర్సిడీస్ జీ55, ఆడీ క్యూ7. ఇష్టమైన రంగులు నలుపు, తెలుపు, బ్లూ. అలవాట్లు... పుస్తక పఠనం, మొక్కలు నాటడం. 

సినీరంగంలో ఆయన మిత్రులు .... వెంకటేష్, త్రివిక్రమ్, మహేష్ బాబు, విజయ్ (తమిళ నటుడు).పవన్ కల్యాణ్ పూర్తిగా శాకాహారి. ఆకుపచ్చటి ఆకులు గల కూరగాయలను తింటారు.