మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. పార్టీలో చేరిన వెంటనే నాగబాబుకి జనసేన నుంచి నరసాపురం ఎంపీ టికెట్  కేటాయించారు.

కాగా.. శనివారం నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అఫిడివిట్‌లో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర్కొన్నారు.