టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాగుంట.. తన రాజీనామా లేఖను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపారు.  

గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసులురెడ్డి కూడా తాను పార్టీని వీడి వైసీపీలో చేరుతానని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రేపు లేదా ఎల్లుండి మాగుంట.. జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శ్రీనివాసులును ఒంగోలు లోక్‌సభ నుంచి బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

"