అనంతపురం : వైసీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కి మరో తీపికబురు అందింది. ఆయన వీఆర్ఎస్ ను పోలీస్ శాఖ ఆమోదించింది. కర్నూలు డిఐజీ గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదించారు. 

దీంతో గోరంట్ల మాధవ్ తన సతీమణి సవిత, కార్యకర్తలతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే అంతకుముందు ఏపీ హైకోర్టు మాధవ్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. 

ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను నిరాకరించింది. అనంతరం ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే రెండు నెలల క్రితం రాజకీయాల్లో చేరాలన్న ఉద్దేశంతో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 

కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీనిపై ట్రిబ్యునల్‌ తీర్పును వెలువరిస్తూ తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సోమవారం హైకోర్టు ఆయన నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం ఆయన వీఆర్ఎస్ కు ఆమోదం తెలిపింది పోలీస్ శాఖ.