కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల పార్టీ అంటూ ఆరోపించారు. 

వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ మూడూ ఒకే తాను ముక్కలని ఆరోపించారు. వైసీపీకి ఓట్లేస్తే బతుకులు నాశనమే అవుతాయని కోట్ల హెచ్చరించారు. టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. దాడులకు భయపడేది కూడా లేదని ఆయన  స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలను కాపాడే బాధ్యత తమదేనని, కాపాడుకునే శక్తి కూడా తమకు ఉందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.