ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. ఎన్నికల ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపై విమర్శల వర్షం కురిపించి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని.. వీరి మాటల యుద్ధం మధ్యలోకి శృతిహాసన్ ని కూడా తీసుకువచ్చారు.

విజయవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని.. పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కమల్‌హాసన్ గారి అమ్మాయి శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి ఇతను. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరోనూ ఇతను మోసం చేశాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతనంటే అసహ్యం పుట్టింది. ’’

‘‘ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదు. హీరోయిన్లను ఏడిపించాడు.. డైరెక్టర్లను ఏడిపించాడు. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడు. ఇతను ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు. ఇతను ఒక క్రిమినల్.. ఇతనొక మోసగాడు.’’ అంటూ కేశినేని నాని ఆరోపించారు.

అంతేకాదు పీవీపీ ఆర్థిక నేరగాడని ఆరోపించారు. హైదరాబాద్ లో పీవీపీ సీన్ అయిపోయిందని.. అందుకే విజయవాడకు వచ్చాడన్నారు. కెనరా బ్యాంక్ లో రూ.137కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి పీవీపీ అని దుయ్యబట్టారు. మనీల్యాండరింగ్, సెబీకేసులు లాంటివి పీవీపీ పై చాలా ఉన్నాయన్నారు. ఇలాంటి ఆర్థిక నేరగాడిని విజయవాడలో అడుగుపెట్టనివ్వకూదని కేశినేని నాని అన్నారు.