Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ భేటీ: లోకసభకు పోటీ

తెలుగుదేశం పార్టీతో కలసి పని చేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి కౌశల్ అంగీకరించారు. 

Kaushal meets Chandrababu to join in TDP
Author
Amaravathi, First Published Mar 9, 2019, 8:13 AM IST

అమరావతి: బిగ్ బాస్ విజేత, సినీ నటుడు కౌశల్ శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఆ భేటీ జరిగింది.మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్‌ను తన వెంట తీసుకుని వచ్చి చంద్రబాబుతో సమావేశపరిచారు. 

తెలుగుదేశం పార్టీతో కలసి పని చేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి కౌశల్ అంగీకరించారు. 

టీడీపీలో చేరడానికి కౌశల్ సిద్ధపడ్డారని, ముహూర్తం చూసుకొని సైకిలెక్కుతారని సమాచారం. టీడీపీ తరఫున కౌశల్  లోకసభకు పోటీచేస్తారని  ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios