ఢిల్లీ: వైసీపీ అధినేత,  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ జన్మలో ఏపీకి ముఖ్యమంత్రి కాలేరని శాపనార్థాలు పెట్టారు. 

ఒక్కో సీటుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా వైసీపీ గెలవలేదని ఆరోపించారు. దళితులు, మైనార్టీలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. అందువల్లే హెలికాప్టర్, ఫ్యాన్ గుర్తులు ఒకేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 

రెండు గుర్తులకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. తనను చూసి, తన గుర్తును చూసి వైఎస్ జగన్ భయపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విజయం సాధిస్తుందని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు.