టీడీపీలో టికెట్ ఆశించి భంగపడిన ఎస్పీవై రెడ్డికి జనసేన భారీ ఆఫర్ ప్రకటించింది. తమ పార్టీలో చేరితే టికెట్ ఖరారు చేస్తామని.. తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఇస్తామని జనసేన ఆఫర్ చేస్తోంది.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎస్పీవైరెడ్డి.. టీడీపీలోకి జంప్ చేశారు. నంద్యాల ఎంపీ టికెట్ తనకే దక్కుతుందనే మొన్నటి వరకు దీమాతో ఉన్నారు. అయితే.. చంద్రబాబు ఆయనను పూర్తిగా పక్కకు పెట్టేశారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు శివానందరెడ్డి పేరును ఖరారు చేశారు. 

 తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి ప్రయత్నించారు. చివరకు నంద్యాల  అసెంబ్లీ సీటు తిరిగి భూమా బ్రహ్మానందరెడ్డికే దక్కింది. దీంతో నంద్యాల ప్రాంతంలో పేరున్న ఎస్పీవై రెడ్డికి ఏ సీటూ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో.. కనీసీం స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయాలని ఆయన భావించారు.

ఈ క్రమంలో.. ఈ అవకాశాన్ని వాడుకోవాలని జనసేన భావిస్తోంది. అందుకే పలువురు జనసేన నేతలు ఆయనతో సంప్రదింపులు మొదలుపెట్టారు. తమ పార్టీ నుంచి టికెట్ ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఎస్వీరెడ్డి ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.