బుధవారం సాయంత్రం ఐటి అధికారులు మోదుగుల నివాసంపై, కార్యాలయంపై ఐటి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల అన్నారు. 

గుంటూరు : గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన కార్యాలయంలోనే కాకుండా మోదుగుల చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ సుధాకర్‌రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం సాయంత్రం ఐటి అధికారులు మోదుగుల నివాసంపై, కార్యాలయంపై ఐటి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల అన్నారు. 

పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం ఉందని, భయపెట్టేందుకే ఈ సమయంలో ఐటీ దాడులు చేపట్టారన్నారు. మోదుగుల ఎన్నికల ఖర్చుపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. 

మంగళవారంనాడు మోదుగుల ప్రత్యర్థి, గుంటూరు టీడీపి లోకసభ అభ్యర్థి గల్లా జయదేవ్ నివాసంలోనూ కార్యాలయంలోనూ ఐటి సోదాలు జరిగాయి. ఈ సోదాలను నిరసిస్తూ గల్లా జయదేవ్ తో పాటు ఆయన అనుచరులు ధర్నాకు దిగారు.