అమరావతి: తాను వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి  తాను టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్టుగా  మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని తన అనుచరులు, సహచరుల నుండి ఒత్తిడి వస్తోందని  ఆయన చెప్పారు.  కానీ, తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన తెలిపారు.

తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదన్నారు. పోటీకి దూరంగా ఉండాలనేదే తన నిర్ణయమని ఆయన గుర్తు చేసుకొన్నారు.నర్సరావుపేటతో పాటు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసే  విషయమై తాను చర్చించలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తాను ఏ ఒక్కరితో చర్చించలేదని లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు.