నరసాపురం: నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీనటుడు మెగా బ్రదర్ నాగబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 

జనసేన పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నరసాపురంకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక విజన్ ఉందని ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యాలనే తపనతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

తమ పార్టీ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. అటు నాగబాబుకు మద్దతుగా జబర్దస్ట్ ఫేం హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగబాబుకు ఓటేసి గెలిపించాలని కోరారు. జనసేన అధికారంలోకి వస్తే 25 ఏళ్ళపాటు చక్కటి భవిష్యత్ అందిస్తాడని ఆది చెప్పారు.