హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్‌ శ్రీనుబాబు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసిపిలో చేరారు. 

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్‌ పేరును ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

జనసేన పార్లమెంట్‌ అభ్యర్థులుగా అమలాపురం స్థానానికి డి.ఎం.ఆర్‌ శేఖర్, రాజమండ్రికి ఆకుల సత్యనారాయణ, విశాఖకు గేదెల శ్రీనుబాబు, అనకాపల్లికి చింతల పార్థసారథి పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది.