రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. డ్రామాలు, హైడ్రామాలు, బంధాలు, బంధుత్వాలు అన్ని ఇక్కడ కనిపించవు. అభ్యర్థులకు కేవలం గెలుపే ముఖ్యం.  తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోటీ పడి కత్తులు దూసుకున్న చరిత్రలు ఎన్నో చూశాం.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కురుపాం రాజవంశీకుడు కిశోర్ చంద్రదేవ్‌పై ఆయన కుమార్తె పోటీ చేస్తున్నారు. దశాబ్ధాల పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ను వీడి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. సీనియర్ నేత కావడంతో కిశోర్‌కు అరకు లోక్‌సభ టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తె శృతీదేవీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.

దీంతో పార్టీ అధిష్టానం ఆమెకు అరకు పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తండ్రి కుమార్తెల మధ్య పోరు తప్పనిసరైంది. ఎన్విరాన్‌మెంటల్ లాను అభ్యసించిన శృతీ... గత మూడు ఎన్నికల్లో తండ్రి కిశోర్ చంద్రదేవ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.