కడప: కడప జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇవ్వనున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారు. 

ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన రాజీనామా విషయాన్ని ఆయన కొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

రాజంపేట లోకసభ స్థానానికి ఆయన ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆయన సహాయ మంత్రిగా ఉక్కు శాఖను నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.