గోరంట్ల మాధవ్.. టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో కయ్యానికి కాలు దువ్వి.. ఏకంగా మీసం మేలేసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచాడు.

హిందూపురం లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన మాధవ్.. టీడీపీ అభ్యర్ధి నిమ్మల కిష్టప్పపై ఘన విజయం సాధించాడు. కౌంటింగ్ సందర్భంగా హిందూపురంలో అరుదైన ఘటన జరిగింది.

తాను సీఐగా ఉన్నప్పుడు ఏ డీఎస్పీకి సెల్యూట్ చేశాడో.. అదే డీఎస్పీ నుంచి ఎంపీ హోదాలో మాధవ్ సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.