అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అత్యధిక సంఖ్యలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు నాయుడు అదే ఉత్సాహంతో పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. 

పరోక్షంగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించనున్నారు. 25 మంది పార్లమెంట్ సభ్యులకు గానూ ఐదు స్థానాలు మినహా 20 సీట్లకు సంబంధించి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది.  

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు
1. శ్రీకాకుళం - కె. రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం- పూసపాటి అశోక్ గజపతిరాజు
3. విశాఖపట్నం-భరత్/ పల్లా శ్రీనివాస్
4. అనకాపల్లి-ఆడారి ఆనంద్
5. అరకు- వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్
6. కాకినాడ-చలమలశెట్టి సునీల్ 
7. రాజమహేంద్రవరం-మాగంటి రూప/ముళ్లపూడి రేణుక/బొడ్డు భాస్కరరామారావు
8. అమలాపురం-జీఎంసీ హరీష్ 
9. ఏలూరు-మాగంటి బాబు
10. నర్సాపురం-పెండింగ్
11. విజయవాడ-కేశినేని నాని
12. మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ/వంగవీటి రాధాకృష్ణ
13. గుంటూరు-గల్లా జయదేవ్
14. నరసరావుపేట-రాయపాటి సాంబశివరావు
15. కర్నూలు-కోట్ల విజయభాస్కర్ రెడ్డి
16. నంద్యాల-పెండింగ్
17. చిత్తూరు-శివప్రసాద్
18. తిరుపతి-పనబాక లక్ష్మీ
19. కడప-ఆదినారాయణ రెడ్డి
20. రాజంపేట-పెండింగ్ 
21. అనంతపురం-జేసీ పవన్ కుమార్ రెడ్డి
22. హిందూపురం-నిమ్మల కిష్టప్ప
23. ఒంగోలు-శిద్ధా రాఘవరావు
24. బాపట్ల-మాల్యాద్రి/శ్రావణ్ కుమార్
25. నెల్లూరు- బీద మస్తాన్ రావు