బిజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు పేర్కొన్నారు.  సోమవారం కృష్ణంరాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

 మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవ్వడం ఖాయమని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని, గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునారావృత్తం అవుతాయని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. కాగా పోటీ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రకటించారు. మరి టికెట్ దక్కుతుందో లేదో చూడాలి.