అమరావతి: ఈనెల 30న ప్రజలందరి సమక్షంలో విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. తాను విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసంతకం ఏ అంశంపై చేస్తారని ప్రశ్నించగా తొలి సంతకం కాదని నవరత్నాలు అమలుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. తాను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు చూశాను. 

36000 కిలోమీటర్ల సుదీర్ఠ పాదయాత్రలో ప్రజల బాధలు చూశాను. వేదనలు విన్నానని తెలిపారు. నేను చూశా నేను విన్నాను. నేను ఉన్నాను అని కచ్చతంగా హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఒక్క సంతకం కాదని నవరత్నాలను తీసుకొచ్చే పాలన ఇవ్వబోతున్నానని భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైయస్ జగన్మోహణ్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్నెళల్లోనే మీ అందరితో మంచి సీఎం అనిపించుకుంటా: వైయస్ జగన్