Asianet News TeluguAsianet News Telugu

అతి పెద్ద అఫిడవిట్: కారు లేని జగన్, ఆస్తులూ అప్పులూ ఇవే...

మెుత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరాస్తుల విషయానికి వస్తే జగన్ కు రూ.339,89, 43, 352 జగన్ భార్య వైఎస్ భారతీరెడ్డి రూ. 92,53,49,352 వైఎస్ జగన్ పెద్దకుమార్తె వైఎస్ హర్షిణిరెడ్డి రూ.6,45,62,191 వైఎస్ జగన్ చిన్నకుమార్తె వైఎస్ వర్షారెడ్డి రూ.4,59,82,372లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 
 

ys jagan mohan reddy  declares his assets and liabilities
Author
Kadapa, First Published Mar 22, 2019, 5:09 PM IST

కడప: ఏపీ ఎన్నికల్లో ఇప్పటి వరకు దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ లో అతిపెద్ద అఫిడవిట్ వైఎస్ జగన్ దేనని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వైఎస్ జగన్ సమర్పించిన అఫిడవిట్ అతిపెద్దదిగా ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే శుక్రవారం వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జగన్ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆస్తులను పొందుపరిచారు. అయితే అఫిడవిట్ లో వైఎస్ జగన్ కు సొంతకారు కూడా లేదు. 

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వేరొకరివి తనపేరున రిజిస్టర్ చేసినట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. మెుత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరాస్తుల విషయానికి వస్తే జగన్ కు రూ.339,89, 43, 352 జగన్ భార్య వైఎస్ భారతీరెడ్డి రూ. 92,53,49,352 వైఎస్ జగన్ పెద్దకుమార్తె వైఎస్ హర్షిణిరెడ్డి రూ.6,45,62,191 వైఎస్ జగన్ చిన్నకుమార్తె వైఎస్ వర్షారెడ్డి రూ.4,59,82,372లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

ఇకపోతే వైఎస్ జగన్ కు సంబంధించి స్థిర ఆస్తుల విషయానికి వస్తే స్థిర ఆస్థుల విలువ రూ.35.30 కోట్లు కాగా ఆయన భార్య వైఎస్ భారతి కి సంబంధించి స్థిర ఆస్తుల విలువ రూ.31.59 కోట్లుగా వైఎస్ జగన్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.  

బ్యాంక్ అకౌంట్లలో ఉన్న జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు 

వైఎస్ జగన్ బ్యాంక్ అకౌంట్లలో నగదు వివరాలు:
1. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.20లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.కోటి 20 లక్షలు
3. ఎస్ బీఐ ( హైదరాబాద్)                                   :రూ.21లక్ష 44 వేలు
4. హెచ్.డి.ఎఫ్.సి (మల్కాజ్ గిరి)                          :రూ.25 వేలు

వైఎస్ భారతి బ్యాంక్ అకౌంట్లో నగదు వివరాలు:
1. యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు)                          :రూ.9.70లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు)  : రూ.5.73 లక్షలు
3. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు)  : 20.90లక్షలు
4. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బంజారాహిల్స్ ) : రూ.8.09లక్షలు
5.యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు)                                 :రూ.17.41లక్షలు 
6. ఎస్ బీఐ (పులివెందుల)                                         :రూ.21.37లక్షలు
7. యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ కార్డ్                                  : 1.09లక్షలు 

వైఎస్ హర్షిణి రెడ్డి:
1. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు)  : రూ.70 లక్షలు
2. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు)   :రూ.51.38లక్షలు
3. నాట్ వెస్ట్ (లండన్ )                :రూ.2.05లక్షలు

వైఎస్ వర్షారెడ్డి:
1.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు)  : రూ.34 లక్షలు
2.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు)  : రూ.2.07లక్షలు

షేర్ల వివరాలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.317,45,99,618  
వైఎస్ భారతి షేర్ల వివరాలు 62,35,01,849 
వైఎస్ హర్షిణిరెడ్డి   1,18,11,358 
వైఎస్ వర్షారెడ్డి  24,27,058 

చిన్నమెుత్తాల పొదుపు,  పాలసీలు
1. వైఎస్ జగన్- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 13.24 లక్షలు 
2. వైఎస్ భారతి- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 10.21 లక్షలు
3. వైఎస్ భారతి- మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 2.04 కోట్లు 
4. వైఎస్ భారతి- టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ పాలసీ 24.04 లక్షలు

                                రావాల్సిన బకాయిలు                                చెల్లించాల్సిన అప్పులు
1. వైఎస్ జగన్               రూ.15.53 లక్షలు                                  రూ.1.19 కోట్లు 
2. వైఎస్ భారతి              రూ. 1.02 కోట్లు                                       2.45 కోట్లు

బంగారు ఆభరణాలు

1.వైఎస్ జగన్           :ఏమీ లేవు
2. వైఎస్ భారతి        :3.57 కోట్లు విలువైన 5.862 కిలో గ్రాముల బంగారం, వజ్రాలు
3. వైఎస్ హర్షిణిరెడ్డి   :3.16 కోట్లు విలువైన 4.187 కి.లోగ్రాముల బంగారం, వజ్రాలు 
4. వైఎస్ వర్షారెడ్డి      :3.12 కోట్లు విలువైన 3.45 కిలోల బంగారం, వజ్రాలు

వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న నగదు వివరాలు
వైఎస్ జగన్ చేతిలో రూ. 43,500 ఉండగా ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి చేతిలో రూ.49,390 లు ఉండగా ఆయన పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో రూ.7440 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. 

వైఎస్ జగన్ స్థిర ఆస్థుల వివరాలు

1. వైఎస్ జగన్ కు సంబంధించి వ్యవసాయ భూమి విలువ రూ.42.44లక్షలు
2. వైఎస్ భారతికి సంబంధించి భూముల విలువ రూ.26.65లక్షలు
వ్యవసాయేతర భూముల వివరాలు
1. వైఎస్ జగన్ వ్యవసాయేతర భూముల విలువ రూ.8.42 కోట్లు
2. వైఎస్ భారతి వ్యవసాయేతర భూముల విలువ రూ.7.17 కోట్లు

కమర్షియల్ బిల్డింగ్స్ వివరాలు
1. వైఎస్ జగన్ కు చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.14.46 కోట్లు
2. వైఎస్ భారతికి చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.10.25 కోట్లు

నివాస భవనాలు
1. వైఎస్ జగన్ కు ఉన్న నివాస భవనాల విలువ రూ.11.99కోట్లు
2. వైఎస్ భారతి కి ఉన్న నివాస భవనాల విలువ రూ.13.89 కోట్లు

 ఇకపోతే ఏప్రిల్ 2019న వైఎస్ జగన్ కట్టాల్సిన జీఎస్టీ విలువ రూ.5.80 లక్షలు
            వైఎస్ భారతి కట్టాల్సిన జీఎస్టీ విలువరూ.27,824వేలు
వైఎస్ జగన్ కు సంబంధించి చెల్లించాల్సిన వివాదాల్లోని బకాయిలు రూ.66.68 కోట్లు కాగా జగన్ భార్య వైఎస్ భారతి చెల్లించాల్సిన వివాదాల్లోని బకాయిలు విలువ 6.75 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు: జన సంద్రమైన పులివెందుల

Follow Us:
Download App:
  • android
  • ios