కడప: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఓ నమ్మకమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని ఆయన సతీమణి వైఎస్ భారతి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. 

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికలప్రచారంలో పాల్గొన్న భారతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఓటెయ్యాలని కోరారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. 

వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని భారతి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందన్నారు. 

వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల ద్వారా ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు పాలన చూశారని ఆయనకు ఓటేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు అమలు చెయ్యలేదని స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని వైఎస్ భారతి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అప్పుడే భయపడలేదు, నువ్వు బెదిరిస్తే భయపడతాడా: చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ కౌంటర్