అమరావతి: ఈ ఎన్నికల్లో  గెలుపు విషయంలో  తాను భయపడడం ఏమిటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరు సరిగా లేదనే తాను పోరాటం చేస్తున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.

సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేనేందుకు ఓడిపోతానని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చిందో మీరు చూడలేదా అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

ఓట్లు వేసేందుకు స్వంత గ్రామానికి వచ్చిన వారికి తాను సరైన రవాణా సౌకర్యం కల్పించనందుకు తాను సిగ్గుపడుతున్నట్టు ఆయన తెలిపారు.రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా వచ్చారని ఆయన వివరించారు. అండర్ కరెంట్‌గా ప్రజల స్పందనను చూస్తే  తమ పార్టీకి 150కు పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారరు.

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసివేస్తే క్షమాపణ చెప్పి వదిలేశారని ఆయన గుర్తు చేశారు.మరో వైపు ఏపీ రాష్ట్రంలో సుమారు 7 లక్షల ఓట్లను తీసివేసేందుకు ఫారం-7 ద్వారా ధరఖాస్తులు చేశారని ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై తాము కేసు నమోదు చేసి సిట్ దర్యాప్తు చేశామన్నారు.

అయితే ఏ కంప్యూటర్ల ఆధారంగా ఓట్ల తొలగింపు కోసం ధరఖాస్తులు అందాయనే విషయమై తాము కోరినా కూడ ఈసీ నుండి ఇంత వరకు సమాధానం రాలేదన్నారు.బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఏపీలో పోలింగ్ అర్ధరాత్రి వరకు ఏనాడూ జరగలేదన్నారు.

ఈవీఎం మొమరీ చిప్స్‌ను తారుమారు చేసే అవకాశం ఉందని చంద్రబాబునాయుడ చెప్పారు. తాను లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పకుండా  ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబునాయుడు ఈసీ తీరును దుమ్మెత్తి పోశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రారంభిస్తారా అని బాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారం ప్రవర్తించిందన్నారు. 

ఈవీఎంలు పనిచేయకపోవడానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. ఈ తరహాలో పోలింగ్‌లో తాను ఏనాడూ అవకతవకలను చూడలేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఎలాంటి ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయొచ్చు: హరిప్రసాద్

ఏపీలో మాదే అధికారం, తెలంగాణలో ఇలా చేశారు: బాబు వ్యాఖ్యలు

స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు: కృష్ణా జిల్లాలో కలకలం

నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం

మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు

సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి