ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా... అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు చోటు చేసుకోవడానికి ఆరు జిల్లాలు కీలకమైన పాత్ర పోషించనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా... అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు చోటు చేసుకోవడానికి ఆరు జిల్లాలు కీలకమైన పాత్ర పోషించనున్నాయి. ఈ ఆరు జిల్లాలు ఈ దఫా ఏ పార్టీకి మొగ్గు చూపుతాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి విజయావకఆవాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలో 96 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరు జిల్లాలోని 96 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 71 స్థానాలను గెలుచుకొంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి నాలుగు సీట్లు కూడ దక్కాయి. మరో వైపు ఇదే జిల్లాలో ఓ ఇండిపెండెంట్ కూడ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుండి టీడీపీ టిక్కెట్టు దక్కని కారణంగా వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత వర్మ టీడీపీలో చేరారు.ఈ ఆరు జిల్లాల్లో టీడీపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ, టీడీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే గత ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.
జనసేన పార్టీ ప్రభావం ఒక్కో జిల్లాలో ఓక్కో రకంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పోటీ చేయడం వల్ల టీడీపీకి ప్రయోజనం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పోటీ చేయడం వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో పోటీ చేసిన సమయంలో కాపు సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాయి. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కాయి.
సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోంది.త అయితే సామాజిక వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తోంది. అయితే కులాలకు అతీతంగా సంక్షేమ పథకాల ప్రభావం ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం ప్రభావం కన్పించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.ఇక అనంతపురం జిల్లాలో టీడీపీకి మొదటి నుండి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లను దక్కించుకొంది. ఈ దఫా కూడ మెజార్టీ సీట్లను గెలుచుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.
సంబంధిత వార్తలు
