కర్నూలు: చేసిన తప్పు సరిదిద్దుకునేందుకు తాను వైసీపీలో చేరబోతున్నానని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు అసెంబ్లీ సీట్ ఇవ్వకపోవడంతో అలిగిన ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం తన అనుచరులతో సమావేశమయ్యారు. 

కర్నూలు నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్ కంటే ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అలాంటిది తమకు కాకుండా టీజీ భరత్ కు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు మోసం చేశారని ఆరోపించారు. 

తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి వర్గంలో తొలగించారని చెప్పుకొచ్చారు. 2009లో తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడును నమ్మి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరితే ఇప్పుపడు కూడా అన్యాయమే చేశారంటూ ఆరోపించారు ఎస్వీ మోహన్ రెడ్డి. 

చంద్రబాబును నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడానని స్పష్టం చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు తాను తిరిగి వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు ఎస్వీ మోహన్ రెడ్డి. ఎస్వీ మోహన్ రెడ్డి సోదరుడు ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయంపై మంత్రి భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలు గందరగోళానికి గురయ్యారు. మంత్రి అఖిల ప్రియ ఎస్వీ మోహన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

  ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలో నాలాంటి బాధితుడు మరొకరు ఉండరేమో: ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆవేదన

టీజీ వెంకటేష్ ఎఫెక్ట్: కార్యకర్తలతో భేటీ, ఎస్వీ మోహన్ రెడ్డి ఎటు