అమరావతి: తన విషయంలో ఎలాంటి తప్పులు చూపలేని విపక్షాలు  ప్రసంగంలో చేసిన తప్పును పెద్దదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు. తొలుత తనను అవినీతిపరుడిగా చూపేందుకు ప్రయత్నించారన్నారు. 

ఈ విషయమై తాను చేసిన సవాల్‌ను ఎవరూ కూడ నిరూపించలేదన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా తనపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రచార సభల్లో తాను గంట మాట్లాడితే ఏదో ఒక సందర్భంలో తప్పు దొర్లితే అదే విషయాన్ని పదే పదే చూపిస్తున్నారన్నారు. తన మీద ప్రచారం చేయడానికి ఏమీ దొరకక ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపుతున్నారని ఆయన ఆరోపించారు.  ప్రతి ఒక్కరి ప్రసంగంలో కూడ తప్పులు దొర్లుతుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ ప్రసంగంలో కూడ తప్పులు ఉంటాయన్నారు. మా వాళ్లు ఈ విషయాన్ని పట్టుకొంటే దొరుకుతాయన్నారు. కానీ, సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారంలో అర్ధం లేదని   లోకేష్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

మా అభ్యర్థులను కేసీఆర్ బెదిరిస్తున్నారు: లోకేష్

టీడీపీ గెలుచుకోలేని సీటు కావాలన్నా, బాబు ఇచ్చేశాడు: లోకేష్