గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ నామినేషన్ దాఖలు చేశారు. భార్య నారా బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్, తల్లి భువనేశ్వరిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ దాఖలు సందర్భంగా లోకేష్ దాఖలు చేసిన అఫిడవిట్ లో తన ఆస్తి విలువ సుమారు రూ. 375 కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తిలో చరాస్తుల విలువ రూ.253 కోట్ల 68 లక్షలు కాగా స్థిరాస్తుల విలువ రూ.66 కోట్ల 78 లక్షలని వెల్లడించారు. 

మరోవైపు లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి వ్యాపార వేత్త అని పేర్కొన్న లోకేష్ ఆమె స్తిరాస్థుల విలువ రూ. 18.74 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే చరాస్తుల విలువ రూ. 14 కోట్ల 40 లక్షలు అని వెల్లడించారు. అటు తనయుడు నారా దేవాన్ష్ స్థిర ఆస్తుల విలువ రూ.16.17 కోట్లు కాగా చరాస్తుల విలువ రూ. 3.88 కోట్లని లోకేష్‌ తన అఫిడవిట్‌లో పొందుపరిచారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు కంటే భువనేశ్వరికే ఎక్కువ ఆస్తి: చంద్రబాబు ఆస్తులు, అప్పులు ఇవే....