చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయన తరపున స్థానిక టీడీపీ నేతలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు తన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 700 కోట్లుగా పేర్కొన్నారు. మెుత్తం ఆస్తుల్లో తన స్థిర ఆస్తి విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు కాగా చరాస్తుల విలువ 47 లక్షల 38 వేల రూపాయలని పొందుపరిచారు. 

ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ రూ. 574 కోట్లుగా పేర్కొన్నారు. భువనేశ్వరి స్థిరాస్తుల విలువ రూ. 95 కోట్లుగా అఫిడవిట్ లో పొందపరిచారు. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన ఆస్తి విలువను రూ. 176 కోట్లుగా చూపించారు. అయితే తాజాగా అఫిడవిట్ లో తన ఆస్తుల విలువను రూ.700కోట్లుగా ప్రకటించారు.