అమరావతి: తెలంగాణ అవసరాల కోసం వాన్‌పిక్  భూముల్లో ప్రైవేట్ పోర్టును నిర్మించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు.

ఆదివారం నాడు సినీ నటుడు శివాజీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు,  రాజధానిపై ట్రూత్‌ పేరుతో సినీ నటుడు శివాజీ మీడియా సమావేశంలో  వీడియోను ప్రదర్శించారు.

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్న వాన్‌పిక్ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కన్ను పడిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అవసరాల కోసం కేసీఆర్ ఈ భూముల్లో  ప్రైవేట్ పోర్టును నిర్మించేందుకు పూనుకొన్నాడని  ఆయన ఆరోపించారు. 

ఈ భూముల కోసమే ఆయన జగన్‌తో దోస్తికి దిగాడని  శివాజీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో, ఏపీ రాష్ట్రంలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటైతే ఈ భూముల్లో కేసీఆర్ పోర్టును నిర్మించే అవకాశాలు లేకపోలేదని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఏపీపై  అంత ద్వేషం ఉన్న కేసీఆర్ జగన్‌తో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు.

కేసీఆర్,  జగన్‌కు ఎవరికి వారికి వారి  ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కారణంగానే కేసీఆర్‌ జగన్‌కు స్నేహ హస్తం ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏపీలో వస్తే పోలవరం ప్రాజెక్టును అడ్డుకొంటారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆపిల్‌ లాంటి సంస్థలను ఏపీకి రాకుండా అడ్డుకొన్నారు: శివాజీ

టీడీపీ గెలవకపోతే అమరావతి నుండి రాజధాని తరలింపు: శివాజీ సంచలనం

పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ