Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ గెలవకపోతే అమరావతి నుండి రాజధాని తరలింపు: శివాజీ సంచలనం

ఈ ఎన్నికల్లో మరోసారి ఏపీ రాష్ట్రంలో టీడీపీ  అధికారంలోకి రాకపోతే రాజధాని నుండి అమరావతి తరలిపోనుందని  సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు.
 

cine actor sivaji sensational comments on ys jagan over amaravathi
Author
Amaravathi, First Published Apr 7, 2019, 10:22 AM IST

అమరావతి: ఈ ఎన్నికల్లో మరోసారి ఏపీ రాష్ట్రంలో టీడీపీ  అధికారంలోకి రాకపోతే రాజధాని నుండి అమరావతి తరలిపోనుందని  సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు సినీ నటుడు శివాజీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు,  రాజధానిపై ట్రూత్‌ పేరుతో సినీ నటుడు శివాజీ మీడియా సమావేశంలో  వీడియోను ప్రదర్శించారు.

ఒక కులం కోసం అమరావతిలో నిర్మితమయ్యే రాజధానిని ఇతర ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఎవరి కోసం అమరావతిలో జరుగుతున్న రాజధానిని ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను కట్టబెట్టిన రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఒక్క ఇటుకను కూడ పేర్చలేదని  జగన్ చేసిన ఆరోపణలను శివాజీ ప్రస్తావించారు.

అమరావతిలో నిర్మాణాలు సాగుతున్న ప్రాంతంలో  ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయాలపై శివాజీ వీడియోలను చూపిస్తూ  నిర్మాణాల గురించి వివరించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నివాస గృహాలతో పాటు అధికారుల కోసం తలపెట్టిన నిర్మాణాలను శివాజీ పరిశీలించారు.  ఈ విషయాలను ఆయన వీడియోలో వివరించారు.

సెక్రటేరియట్ భవనం నిర్మిస్తున్న విషయాన్ని వాస్తవమేనని శివాజీ చెప్పారు. ఈ నిర్మాణాలు గ్రాఫిక్స్ మాయాజాలం కాదని జగన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలను  ఆయన సంధించారు.తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను కూడ శివాజీ ఈ వీడియోలో చూపించారు. వాస్తవాలను అందరూ అంగీకరించాల్సిందేనని ఆయన చెప్పారు.

అమరావతిలో ఏం జరగడం లేదని చెప్పడం ప్రజలను అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.  అమరావతిలో 8 టవర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయని ఆయన వివరించారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకొంటే రాజధాని  నిర్మాణం జరుగుతోందన్నారు. లేకపోతే రాజధాని హైద్రాబాద్‌కు వెళ్తుందా అనే అనుమానాన్ని కూడ ఆయన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ

 

Follow Us:
Download App:
  • android
  • ios