హైదరాబాద్: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తనపై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

గురువారం నాడు ఆయన తన హైద్రాబాద్‌లోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనపై మీడియాలో వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు.

తన తప్పు ఉంటే బహిరంగంగా చెబితే సరిదిద్దుకొనేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా, తిట్టినా, చిరునవ్వుతో  సహించేందుకు తాను జగన్మోహన్ రెడ్డిని కాదన్నారు.

రాధా కృష్ణ అంటే తనకు గౌరవమని చెప్పారు.  అక్షరాన్ని ఆయుధంగా మారుస్తానని రాధాకృష్ణ చెప్పుకొన్నాడు,  అక్షరాన్ని ఆయుధంగా మార్చకున్నా ఫరవాలేదు... ఆ అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.  చేతిలో మీడియా ఉందని చేసుకోవాలని భావించి తన జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. 

తాను బ్యాంకులను, ప్రభుత్వాలను మోసం చేశానా అని ఆయన ప్రశ్నించారు. కానీ, తాను అనని మాటలను అన్నట్టుగా రాస్తే ఊరుకోబోనని ఆయన హెచ్చరించారు. పక్షపాతంతో మీడియా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. నాపై రాధాకృష్ణ ఎందుకు తప్పుడు వార్తలు రాస్తున్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం తాను రూపొందిస్తున్న సినిమాలో చంద్రబాబును అవమానించినట్టుగా టీడీపీ నాయకులు కంప్లయింట్ ఇచ్చారని ఆయన చెప్పారు.
 తన సినిమా ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని సినిమాలో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.

చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకులకు కులపిచ్చి ఉందని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి పోయేది లేదన్నారు పోసాని. అందుకు సాక్ష్యంగా గతంలో చంద్రబాబు ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు  అన్న వ్యాఖ్యలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌  మీరు దళితులు, మీరు వెనకబడిన వారు, మాకు పదవులు, మీకెందుకురా  అంటూ చేసిన వ్యాఖ్యల వీడియోలను చూపించారు.

సంబంధిత వార్తలు

నాకు ఆపరేషన్ జరగొచ్చు: ఈసీ నోటీసుపై పోసాని కృష్ణమురళి