హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ ఇచ్చిన నోటీసుకు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి  స్పందించారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ పోసానిని ఆదేశించారు.

ఈసీ నోటీసులకు సమాధానంగా గురువారం నాడు ఈసీకి ఆయన ఓ లేఖ రాశారు.రెండు  రోజుల క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోసాని కృష్ణ మురళి చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై  ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఈసీ పోసాని కృష్ణ మురళికి నోటీసులు జారీ చేసింది. 

తనకు నిజంగానే ఆరోగ్యం బాగా లేదన్నారు.తాను నడవలేని స్థితిలో ఉన్నానని ఆయన ప్రకటించారు. తనకు ఆపరేషన్ కూనడ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.   ఈసీ విచారణకు తాను హాజరుకాలేనని ఆయన ప్రకటించారు.  ఈ విషయమై తన ఆరోగ్యానికి సంబంధించి ఈసీకి లేఖ రాశారు.