Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులపై నిరసన: ధర్నాకు దిగిన చంద్రబాబు

ప్రధానమంత్రి మోడీ వైసీపీతో కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

chandrababunaidu protest against modi infront of ambedkar statue in vijayawada
Author
Amaravathi, First Published Apr 5, 2019, 1:02 PM IST


ఏపీలో  టీడీపీ అభ్యర్ధులను లక్ష్యంగా ఐటీ దాడులను నిరసిస్తూ శుక్రవారం నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న విగ్రహం వద్ద చంద్రబాబునాయుడు ధర్నాకు దిగారు.

జగన్ హైద్రాబాద్‌లో కూర్చొని కుట్రలు,కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ చర్యలను ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. మోడీ రాక్షస పాలన చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

ఏకపక్షంగా దాడులు చేస్తే ఊరుకొనేది లేదన్నారు.  మోడీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన చెప్పారు. ఐటీ అధికారులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇదే పద్దతిలో వ్యవహరిస్తే అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు.

ఎల్‌కే అద్వానీ చెప్పినదానికి భిన్నంగా మోడీ వ్యవహరిస్తున్నాడని బాబు అభిప్రాయపడ్డారు. సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ మోడీకి చీమ కుట్టినట్టుగా కూడ లేదన్నారు.. ఎవరైనా తప్పులు ఉపేక్షించబోమని బాబు ఐటీ అధికారుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

ఐటీ దాడులపై నిరసన: అంబేద్కర్ విగ్రహం వద్ధ ధర్నా చేయనున్న బాబు

 

Follow Us:
Download App:
  • android
  • ios