విజయవాడ: కేంద్రంలోని మోడీ సర్కార్ కక్షగట్టి దాడులు చేయిస్తోందని ఆరోపిస్తూ విజయవాడలోని  తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు దీక్షకు దిగనున్నారు.

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ, ఈడీ దాడులను నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షకు దిగనున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసేందుకు గాను ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. టీడీపీ అభ్యర్థులు పుట్టా సుధాకర్ యాదవ్,  పి. నారాయణ, ఉగ్ర నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.

తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో కూడ శుక్రవారం నాడు ఐటీ సోదాలు జరిగాయి. ఈ దాడులను నిరసిస్తూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద చంద్రబాబునాయుడు ధర్నాకు దిగుతారు. రాష్ట్రంలోని పలు అంబేద్కర్ విగ్రహల వద్ద టీడీపీ నేతలునిరసనలకు దిగనున్నారు.