అమరావతి: ఎన్నడూలేని విధంగా ఈ దఫా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనేక  విమర్శలను ఎదుర్కొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  ఈవీఎంలపై మరింత నమ్మకాన్నిపెంచేందుకు వీలుగా వీవీప్యాట్‌లను తీసుకొచ్చారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

ఈవీఎంలలో ఓటు వేసిన తర్వాత ఎవరికీ ఓటు వేశారనే విషయం తెలియదన్నారు. వీవీప్యాట్‌‌స్లిప్పుల లెక్కింపుతో జవాబుదారీతనం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీవీప్యాట్ స్లిప్పులను బ్యాలెట్ బాక్సుల్లో వేస్తే... ఈవీఎంలలో వచ్చిన లెక్కలకు, వీవీప్యాట్ స్లిప్పులను సరిచూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికి ఎన్నికల సంఘానికి వచ్చిన నష్టమేమిటని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాను అధికారంలో ఉన్న సమయంలో.... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడ పోరాటం చేసినట్టుగా బాబు గుర్తు చేశారు.50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈవీఎంలలో ఉన్న లెక్కకు....వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య  తేడా వస్తే ఏం చేయాలనే దానిపై ఎన్నికల సంఘం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై మరోసారి ఈసీని ప్రశ్నించనున్నట్టు బాబు చెప్పారు.17 సీ పార్ట్ 1 విషయమై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను ఇవ్వాలన్నారు.ఈవీఎంల విషయమై అనేక రకాలుగా ప్రచారాలు సాగుతోందని  బాబు గుర్తు చేశారు.

ఎన్నికల సంఘం విశ్వసనీయతను  కోల్పోయిందని ఆయన  ఆరోపించారు.రేపు 22 పార్టీలతో  ఢిల్లీలో సమావేశం కానున్నట్టుగా బాబు చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయమై ధర్నా చేయాలా....వినతి పత్రం ఇవ్వాలా అనే విషయమై అన్ని పార్టీల నేతలు చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు.

ఏపీలో ఫారం-7 ద్వారా ఓటర్లను తొలగించాలని ధరఖాస్తు చేశారని.... ఈ విషయమై తాము సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఐపీ అడ్రస్ ఇవ్వడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

2014లో కూడ వైసీపీదే అధికారమన్నారు: ఎగ్జిట్ పోల్స్‌పై బాబు ఎద్దేవా

గెలుపు మాదే:ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలతో ఆత్మరక్షణలో బాబు