అమరావతి: 2014 లో కూడ  ఏపీలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధిస్తోందని జాతీయ చానెల్స్ కూడ ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రకటించాయని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

ఈ ఎగ్జిట్ పోల్స్‌ను చూసి ఆ సమయంలో వైసీపీ నేతలు మంత్రివర్గాన్ని కూడ తయారు చేసుకొన్నారని చెప్పారు. ఇప్పుడు కూడ వైసీపీ నేతలు మంత్రివర్గాన్ని తయారు చేసుకొంటున్నారని బాబు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌‌తోనే అమితమైన ఆనందం పొందితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ నేతలు విపక్ష పార్టీలన్నీ కూడ ఐసీయూలోకి వెళ్లాయని విమర్శలు చేయడాన్ని బాబు తప్పుబట్టారు.ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్‌ను కనిపెట్టలేకపోయారని బాబు విమర్శించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ప్రజల అభిప్రాయాన్ని అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

గెలుపు మాదే:ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలతో ఆత్మరక్షణలో బాబు