Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ తొలి జాబితా: బీసీలకు 31, ఓసీలకు 71 సీట్లు

టీడీపీ జాబితాలో ఓసీలకు చంద్రబాబునాయుడు ఎక్కువ సీట్లను కేటాయించారు

chandrababunaidu allots 71 seats for oc caste in ap
Author
Amaravathi, First Published Mar 15, 2019, 8:42 AM IST


అమరావతి:టీడీపీ జాబితాలో ఓసీలకు చంద్రబాబునాయుడు ఎక్కువ సీట్లను కేటాయించారు. ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే 126 అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు గురువారం రాత్రి 11 గంటలకు విడుదల చేశారు.

ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 126 అభ్యర్థులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. ఈ దఫా మాత్రం టీడీపీ సీనియర్ నేత ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పోటీ చేయడం లేదు. కేఈ కృష్ణమూర్తిి తనయుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

మరో వైపు అనంతపురం జిల్లాలోని రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పరిటాల సునీత ఈ దఫా పోటీకి దూరంగా ఉంటున్నారు.ఈ స్థానం నుండి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగుతున్నాడు.

చంద్రబాబునాయుడు విడుదల చేసిన జాబితాలో 72 మంది ఓసీలకు చోటు దక్కింది. బీసీలకు 31 మందికి చోటు కల్పించారు. ఎస్సీలకు 4, ఎస్టీలకు2 స్థానాలు కేటాయించారు. 

సంబంధిత వార్తలు

126 మందితో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల


 

Follow Us:
Download App:
  • android
  • ios