కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని  ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చంద్రబాబునాయుడు షాకిచ్చారు. వీరి స్థానంలో  కొత్తవారిని బరిలోకి దింపనున్నారు పార్టీ నిర్వహించిన సర్వేలతో పాటు స్థానిక పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని  ఈ మూడు స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపాలని బాబు ప్లాన్  చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోన ప్రత్తిపాడులో  పరుపుల సుబ్బారావుకు బదులుగా ఆయన మనమడు రాజాను చంద్రబాబునాయుడు బరిలోకి దింపుతున్నారు. సుబ్బారావుపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కారణంగా రాజాను బరిలోకి దింపుతున్నారు. అమలాపురం అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనందరావు స్థానంలో దివంగత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌‌ను బాబు బరిలోకి దింపుతున్నారు. 

ఇక పి.గన్నవరం స్థానం నుండి నారాయణమూర్తి స్థానంలో మాజీ న్యాయమూర్తి కూతురుకు టిక్కెట్టును కేటాయించాలని బాబు భావిస్తున్నారు. సిట్టింగ్‌లపై ఉన్న వ్యతిరేకత కారణంగానే బాబు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

తొలి జాబితా నేడే: టీడీపీ అభ్యర్థులు వీరే