మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు బాధ కల్గిస్తే క్షమాపణ చెబుతున్నట్టుగా టీడీపీ నేత అంబికా కృష్ణ ప్రకటించారు. 

ఏలూరు: మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు బాధ కల్గిస్తే క్షమాపణ చెబుతున్నట్టుగా టీడీపీ నేత అంబికా కృష్ణ ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తనపై అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై పీతల సుజాత స్పందించారు. దీంతో బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో అంబికా కృష్ణ మాట్లాడారు. పీతల సుజాతకు క్షమాపణలు చెప్పారు.

పీతల సుజాత తనకు సోదరిలాంటిదని ఆయన చెప్పారు. సుజాతను ఎవరో తప్పుదోవపట్టిస్తున్నారని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు. తనపై పీతల సుజాత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తనకు అర్ధం కావడం లేదన్నారు. పీతల సుజాతను త్వరలోనే కలుస్తానని ఆయన ప్రకటించారు.సుజాతతో తనకు ఎలాంటి విభేధాలు లేవని ఆయన ప్రకటించారు. తమ మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అంబికా కృష్ణ తిట్ల వర్షం: ఏడ్చేసిన పీతల సుజాత

మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం