తమ పార్టీకి చెందిన అంబికా కృష్ణ చేసిన విమర్శలపై మాజీ మంత్రి పీతల సుజాత కన్నీరు పెట్టుకొన్నారు. 

ఏలూరు: తమ పార్టీకి చెందిన అంబికా కృష్ణ చేసిన విమర్శలపై మాజీ మంత్రి పీతల సుజాత కన్నీరు పెట్టుకొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ మంగళవారం నాడు ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై ఆమె స్పందిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకొన్నారు. 

మంత్రి పదవి పోయినప్పుడు కూడ తాను స్పోర్టివ్‌గా తీసుకొన్నట్టుగా ఆమె గుర్తు చేశారు. తనకు టిక్కెట్టు రాలేదనే బాధ కూడ లేదన్నారు.అయితే తనపై అంబికా కృష్ణ చేసిన విమర్శలను చూస్తే బాధ కలుగుతోందన్నారు. తనకు పొగరు, అహంభావం అంటూ అంబికా కృష్ణ చేసిన విమర్శలపై ఆమె మనస్తాపం చెందారు.

పాపాలు చేసినందుకే తనకు టిక్కెట్టు ఇవ్వలేదని అంటారా అని ఆమె ప్రశ్నించారు. ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో తాను పనిచేశానని ఆమె చెప్పారు. వైసీపీలో చేరేందుకు అంబికా కృష్ణ ప్రయత్నించారని పీతల సుజాత ఆరోపించారు. తన స్వంత బావమరిది నుండి హోటల్‌ను లాక్కొన్నారని విమర్శించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర అంబికా కృష్ణది అంటూ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం