ఏపీలో పోలింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ కొత్త డ్రామాలు ఆడుతోందని నటుడు శివాజీ ఆరోపించారు. గురువారం ఏపీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల పోలింగ్ సరళిపై శివాజీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని కూడా విడుదల చేశారు.

వీడియోలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ కి 16ఎంపీ సీట్లు, జగన్ కి 17ఎంపీ సీట్లు, తొలివిడుత పోలింగ్ లో ఎన్డీయేకు మరో 39సీట్లు వస్తాయని.. మొత్తం కలిపి 72 స్థానాలు వస్తాయని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. 

ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని శివాజీ ఆరోపించారు. ఈ నాటకంలో భాగంగగానే జగన్ బెస్ట్ సీఎం అంటూ ప్రశాంత్ కిశోర్ పొగడటం వంటి వీడియోలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.

మే 23వ తేదీన అనూహ్య ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టిచుకోకూడదని పిలుపునిచ్చారు.

related news

కాబోయే సిఎం వైఎస్ జగన్.. తేల్చేసిన ప్రశాంత్ కిశోర్

ఆటవిడుపు: ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్

ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్ (ఫొటోలు)

ప్రశాంత్ కిశోర్ స్టాఫ్ తో జగన్ భేటీ (ఫొటోలు)

జగన్ పై ప్రశాంత్ కిశోర్ ఏమన్నాడో చూడండి (వీడియో)

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి