Asianet News TeluguAsianet News Telugu

కాబోయే సిఎం వైఎస్ జగన్.. తేల్చేసిన ప్రశాంత్ కిశోర్

ఏపీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటానికి మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే.. ఈ ఎన్నికల్లో విజయం పై జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

interested conversation between jagan, prashanth kishore
Author
Hyderabad, First Published Apr 13, 2019, 8:21 AM IST


ఏపీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటానికి మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే.. ఈ ఎన్నికల్లో విజయం పై జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన  జగన్ తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కలిశారు.

 హైదరాబాదులోని ఐ క్యాప్ కార్యాలయానికి వెళ్లి ఆయన ప్రశాంత్ కిశోర్ సిబ్బందిని పలకరించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఆయన ఉల్లాసంగా కనిపించారు. ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యులకు జగన్ కృతజ్ఢతలు తెలిపారు. రెండేళ్లు తన కోసం పనిచేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. 

కాగా.. ఆ సమయంలో జగన్, ప్రశాంత్ కిశోర్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.  ‘‘ నా పాదయాత్రను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లారు. ప్రజల్లోకి వెల్లడం వల్ల వైసీపీ అధికారంలోకి వస్తోంది. కష్టపడి పనిచేస్తే 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది’’ అంటూ జగన్ ప్రశాంత్ కిశోర్ తో అన్నారు.

దానికి సమాధానంగా ప్రశాంత్ కిశోర్..జగన్ ని సీఎంగా సంభోధించారు. ఏపీలో అద్భుతమైన పాలన అందించడానికి మన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారంటూ తన స్టాఫ్ కి పరిచయం చేశారు. బెస్ట్ సీఎంగా కొనసాగాలి అంటూ.. జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రశాంత్ కిశోర్ రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన బీహార్ నుంచి వచ్చి హైదరాబాదులోనే ఉంటూ ఎన్నికల వ్యూహాలను రచిస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

ఆటవిడుపు: ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్

ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో వైఎస్ జగన్ (ఫొటోలు)

ప్రశాంత్ కిశోర్ స్టాఫ్ తో జగన్ భేటీ (ఫొటోలు)

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios