అమరావతి: దివంగత సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు వరుస అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ తెగ ప్రయత్నిస్తోంది. తాజాగా సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణితోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఆ బయోపిక్ వాస్తవాలకు విరుద్ధంగా తెరకెక్కించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమాను విడుదల చేయోద్దని కోరారు. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని అయితే ఆయన సినిమాను వైసీపీ సానుభూతిపరుడు నిర్మించడం ఓ కుట్ర అంటూ ఆరోపించారు. 

ఎన్నికల సంఘం నియామకాల ప్రకారం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బయోపిక్ లు విడుదల చెయ్యకూడదని ఉందని స్పష్టం చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. 

తక్షణమే ఈసినిమా విడుదలను ఆపాలని ఏప్రిల్ 11 వరకు విడుదల చేయోద్దని కోరారు. సినిమా విడుదలైతే రెండు రాష్ట్రాల్లో కాస్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని దివ్యవాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్కంఠ: లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై రాత్రికి ఈసీ నిర్ణయం