డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిన తర్వాత పప్పు నాయుడు బంకర్ లో దాక్కున్నాడా? ఎవరికీ కనిపించకుండా ఎటు వెళ్లాడు?:  విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్య చేశారు. నారా లోకేష్ ను ఆయన పప్పు నాయుడిగా అభివర్ణిస్తూ వస్తున్నారు. 

డేటా చోరీ కేసులో నిందితుడైన ఐటి గ్రిడ్ అధిపతి దాకవరం అశోక్ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. అశోక్ కోసం తెలంగాణ సిట్ గాలిస్తోంది. ఈ స్థితిలో అశోక్ ను నారా లోకేష్ దాచి పెట్టాడని కూడా వైఎస్సార్ కాంగ్రెసు ఆరోపిస్తోంది. దాన్నే విజయసాయి రెడ్డి తన వ్యాఖ్య ద్వారా ప్రశ్నించారు.

ప్రతి విషయంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడే నారా లోకేష్ ఈ మధ్య అంతగా మాట్లాడడం లేదు. దానిపై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం విసిరారు.