కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను వంద రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తా: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని తమను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. ఎపి ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. దానికి ప్రతిస్పందనగా చంద్రబాబు ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తాను వంద రిటర్న్ గఫ్ట్ లు ఇస్తానని అన్నారు. తన వద్ద పనిచేసిన కేసిఆర్ కే అన్ని తెలివితేటలు ఉంటే తనకు ఎన్ని తెలివితేటలు ఉండాలని ప్రశ్నించారు.