రాష్ట్ర విభజన తర్వాత సిఎం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు, మంగళగిరిని గచ్చిబౌలిగా చేస్తా: నారా లోకేష్

మంగళగిరిలో మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రచారాన్ని ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళగిరి నుంచి పోటీ చేయడం తన అదృష్టమంటూ ఆయన పై వ్యాఖ్య చేశారు.