కేసీఆర్! ధైర్యం ఉంటే వచ్చి నాపై గెలువు!!:  చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం నెల్లూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన కేసిఆర్ కు ఆ సవాల్ విసిరారు. 

కేసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా అని ఆయన అడిగారు. తాను మూడు వేల సార్లు తిట్టినట్లు కేసీఆర్ ఆరోపిస్తున్నారని, కేసీఆర్ ఆంధ్రులను తిట్టారని ఆయన అన్నారు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్ తననే తిడుతున్నారని ఆయన అన్నారు. దొంగతనం చేసే పార్టీ వైసిపి అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టారని విమర్శించారు.