జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్‌ జగన్‌ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణం: రామచంద్రయ్య

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సి. రామచంద్రయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. గతంలో అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి, జగన్ ను అరెస్టు చేసింది లక్ష్మినారాయణే. దాన్ని ప్రస్తావిస్తూ రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు అవినీతి లక్ష్మినారాయణకు కనిపించడం లేదా అని కూడా ఆయన అడిగారు.