అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యలో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. క్షణక్షణం ఆసక్తి రేపుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి ఇలా వసల జోరు కొనసాగుతున్నాయి. 

ఇదేకోవలో కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి భార్య తోట వాణితో  కలిసి వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా తోట నరసింహం తెలుగుదేశం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

అనారోగ్యంతో ఉన్న తనను టీడీపీ కనీసం పలకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ తోట నరసింహం వ్యాఖ్యలకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్ 

తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు లోకేష్ పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు. ఆ సమయంలో లోకేష్ తోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మెుత్తానికి ఎంపీ తోట నరసింహం ఆరోపణలకు టీడీపీ ఆధారాలతో సహా దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందన్నమాట. 

అయితే వైసీపీలో చేరిన సందర్భంగా తోట నరసింహం టీడీపీ కోసం తాను ఎంతో చేశానని అలాంటిది ఆ పార్టీ తనను కనీసం గుర్తించలేదని వాపోయారు.  టీడీపీలో అవమానించారని అందుకే పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. 

తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు టీడీపీ కనీసం పరామర్శించలేదని తోట నరసింహం విమర్శలు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. అందుకే పార్టీని వీడుతున్నానని వెల్లడించారు. 

మరోవైపు తోట నరసింహం వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరామర్శించిన ఫోటోలు పబ్లిష్ చేశారు. ఈ సందర్భంగా సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి అంటూ చెప్పుకొచ్చారు. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి దేనికైనా మసిపూసి చిటికెలో మారేడుకాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెప్తుంది అంటూ ట్వీట్ చేశారు. మెుత్తానికి ఎంపీ మాటకు ఆధారాలతో సహా మాట అప్పగించారు ఐటీ మంత్రి నారా లోకేష్.