విశాఖపట్టణం:  విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ స్థానం నుండి ఒక్క మాజీ ఎంపీ, ఒక్క సిట్టింగ్ ఎంపీ పోటీ పడుతున్నారు. జనసేన నుండి  పంచకర్ల సందీప్ బరిలో దిగుతున్నాడు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇటీవలనే అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. 

టీడీపీ అభ్యర్ధిగా సబ్బం హరి ఈ స్థానం నుండి  పోటీ చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్‌కు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.

భీమిలి నుండి సబ్బం హరిని టీడీపీ రంగంలోకి దించింది.భీమిలిలో సబ్బం హరికి అంత సులభంగా ఉండే అవకాశం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు మరో వైపు తనకు భీమిలిలో కార్యాలయం ఉంది, ప్రతి వారం తను భీమిలికి వెళ్తుంటానని  సబ్బం హరి ప్రకటించారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో హరి తన బేస్‌ను నిర్మించుకోవాల్సిన పిరస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాలు వైసీపీకి కొంత ప్రయోజనంగా ఉంటాయని భావించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేసి విజయం సాధించారు.
రాష్ట్ర ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని వైసీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు అభిప్రాయపడుతున్నారు.

తన క్యాడర్ కూడ ఈ నియోజకవర్గంలో తనకు కార్యకర్తల అండ కూడ ఉందని చెప్పారు.ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సబ్బం హరి భీమిలి నుండి పోటీకి సన్నద్దంగా లేరనే ప్రచారం కూడ ఉంది.కానీ ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

భీమిలి అసెంబ్లీ స్థానం కంటే విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు సబ్బం హరి ఆసక్తిగా ఉన్నాడు. మంగళవారం నాడు బాబును కలిసిన సబ్బం హరి ఈ విషయమై బాబుతో మాట్లాడినట్టుగా చెబుతున్నారు కానీ, ఇప్పటికే  విశాఖ ఎంపీ స్థానాన్ని శ్రీభరత్‌కు కేటాయించడంతో భీమిలి నుండే పోటీ చేయాలని బాబు సబ్బం హరికి చెప్పినట్టు సమాచారం.